టీ గ్లాసూ.. టైటిలూ - ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్ట‌డానికేనా?

మరిన్ని వార్తలు

మెగా హీరోల‌పై వ‌ర్మ రెచ్చిపోవ‌డం - ఫ్యాన్సు వ‌ర్మ‌పై తిట్ల దండ‌కం అందుకోవ‌డం చాలా సాధార‌ణ‌మైన విష‌యాలు. అప్పుడ‌ప్పుడూ చిరునో, ప‌వ‌న్ నో కెలికి - మెగా అభిమానుల దృష్టి త‌న‌వైపుకు తిప్పుకునేలా చేయ‌డం వ‌ర్మ‌కి బాగా ఇష్టం. ఒక్కోసారి మెగా హీరోల్ని వ‌ర్మ తిడుతున్నాడో, పొగుడుతున్నాడో కూడా అర్థం కాదు. అలా ఉంటాయి వ‌ర్మ సెటైర్లు. ప‌వ‌న్ ని అయితే చాలాసార్లు ఆడుకున్నాడు వ‌ర్మ‌.

 

ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్ పై సినిమానే తీసేస్తున్నాడు. 'ప‌వ‌ర్ స్టార్‌' అనే టైటిల్ పెట్టి. అస‌లు ఈసినిమా ఏ హీరోనీ ఉద్దేశించింది కాదు అని పైకి చెబుతున్నా - లోలోప‌ల ప‌వ‌న్ అభిమానుల్ని టార్గెట్ చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రీ లుక్ వ‌దిలాడు. టైటిల్ సంగ‌తేమో గానీ, ఆ లోగోలో టీ గ్లాసు చూపించి - మ‌రింత రెచ్చగొట్టే ప్ర‌య‌త్నం చేశాడు. జ‌న‌సేన - టీ గ్లాసు.. ఇవి రెండూ ప‌వ‌న్ తో ముడి ప‌డిన అంశాలు. టీ గ్లాసుతో ప‌వ‌న్ చాలాసార్లు ద‌ర్శ‌న మిచ్చాడు. జ‌న‌సేన పార్టీ గుర్తు అదే. దాన్ని ప‌ట్టుకుని టైటిల్ తో ముడి పెట్టాడంటే వ‌ర్మ మామూలోడు కాదు. ఇవ‌న్నీ ప‌వ‌న్ అభిమానుల్ని ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయ‌డానికి వాడుతున్న ప్ర‌ధాన అస్త్రాలు. మరి కాసేపట్లో సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. దాంతో ఇంకెంత కాంట్ర‌వ‌ర్సీ సృష్టిస్తాడో??


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS