ఎక్కువ మంది ఫిలిం మేకర్లు దాదాపుగా గోళ్లు గిల్లుకుంటూ కూచున్నారు. నటీనటులైతే అట్లు, అంట్లతో బిజీగా గా ఇంట్లో ఉన్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం బయటి పరిస్థితులు, నియమనిబంధనలు తననేమీ చేయలేవని నిరూపిస్తూ సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ, వాటిని ఎటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేస్తూ గతంలో కంటే రెట్టింపు బిజీగా ఉన్నారు.
ఎప్పుడూ ఉండే విమర్శల సంగతి పక్కన పెడితే ఈమధ్య రిలీజ్ చేసిన 'నగ్నం' సినిమా బడ్జెట్ విషయంలో అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. ఒక సినిమా అంటే కోట్లలోనే వ్యవహారం అన్నట్టు సాధారణమెన అభిప్రాయం అందరిలో ఉంది. కానీ నగ్నం బడ్జెట్ మాత్రం రెండు వేలే అని చెప్పి అందరినీ నివ్వెరపరిచాడు. ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.
అయన ఎఫ్బీ పోస్ట్ ఇదే, "వర్మ గారికి కోపమొచ్చింది. అర్ధరాత్రి అంకమ్మ చివాలన్నట్లు ఇందాకే వర్మ ఫోన్. ఏంటయ్యా నా "నేకెడ్" ఫిల్మ్ బడ్జెట్ ఒక లక్ష అనిరాశావ్? అన్నారు. ఏమోనండి అంతకు మించిన ఖర్చు అందులో ఏమీ కనిపించలేదు. అందుకే లక్ష అని డిసైడ్ అయ్యాను, అని క్లియర్ గా చెప్పేసా. అందుకు ఆయన నవ్వుతూ...నన్ను అడిగితే నేను అసలు ఖర్చు చెప్పేవాడినిగా అన్నారు. గురుడు ఎన్నో పెగ్గులో ఉన్నాడో ఏమో అనుకుంటూ. చెప్పండి అన్నా... రెండు వేలు... అక్షరాలా INR 2000 అని బాంబ్ పేల్చాడు. అదేం లెక్కండి అని నేను అడిగేలోపే, లెక్క తేల్చేశాడు. ఆ నౌఖరు పాత్ర చేసిన కుర్రాడి ట్రావెల్ ఖర్చు రెండు వేలు తప్ప ప్రొడక్షన్ ఖర్చు ఏం లేదు. కెమెరా,ఎడిటింగ్ మిక్సింగ్ అన్ని మా దగ్గరే జరిగాయి. ఏ ఖర్చూ లేకుండా అని నిజం చెప్పారు. ఏమిటి ఈయన..."