ఆది సాయికుమార్ 'శ‌శి' చిత్రం డ‌బ్బింగ్‌ ప‌నులు ప్రారంభం.

మరిన్ని వార్తలు

ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న 'శ‌శి' సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆర్‌.పి. వ‌ర్మ‌, రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ నిర్మిస్తున్నారు. హీరో ఆది సాయికుమార్ డ‌బ్బింగ్ చెప్ప‌డం ద్వారా సోమ‌వారం 'శ‌శి' చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని బ్యాన‌ర్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఆది డ‌బ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేశారు.

 

లాక్‌డౌన్ ముగిసి, సినిమాల‌ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చిన దానికి అనుగుణంగా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటూ డ‌బ్బింగ్ ప‌నులు స్టార్ట్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని స‌రికొత్త రూపంలో ఆది ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న జోడీగా సుర‌భి న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో నాయిక పాత్ర‌ను రాశీ సింగ్ పోషిస్తున్నారు. ఒక పాట మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్త‌యింది. ఆ పాట‌ను కూడా మూడు రోజుల్లో పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న 'శ‌శి' సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తుండ‌గా, అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS