థియేటర్లు తెరవకపోవడంతో అంతా ఓటీటీపై ఆధార పడుతున్నారు. అయితే వర్మ మాత్రం ఓ కొత్త మార్గం కనుక్కున్నాడు. పే ఫర్ వ్యూ.. పద్ధతిన తన సినిమాల్ని చూపిస్తున్నాడు. `క్లైమాక్స్` ఇలానే విడుదల చేశాడు. టికెట్టు రేటు వంద పెట్టి ఆ సినిమా చూశారంతా. ఇప్పుడు వర్మ నుంచి మరో సినిమా రాబోతోంది. అదే.. `నగ్నం`. దీన్ని కూడా పే ఫర్ వ్యూ పద్ధతిలోనే చూపించబోతున్నాడు. అయితే ఈసారి వర్మ రేటు పెంచేశాడు. ఈ సినిమా చూడాలంటే 200 చెల్లించాల్సిందే. టీజర్ సోమవారమే విడుదలైంది.
నాయిక అందాలపై వర్మ కెమెరా ఎక్కువగా పోకస్ అయ్యింది.చెప్పరాని చోట్ల.. కెమెరా పెట్టాడు. మహా అయితే ఓ గదిలో ఈ సినిమా మొత్తం తీసేసి ఉంటాడు. పాత్రలు కూడా మూడే. `క్లైమాక్స్` విషయంలో వర్మకి డబ్బులు బాగానే గిట్టుబాటు అయినా, విమర్శలు తప్పలేదు. ఆ సినిమాని ఇంకా సోషల్ మీడియాలో తిడుతూనే ఉన్నారు. మరి ఈ `నగ్నం` ఇంకెన్ని తిట్లు మోస్తుందో? రూ.100 నుంచి రూ.200 రేటు పెంచేశాడంటే.. ఫలితం ఎలా ఉంటుందో?