'తూనీగా తూనీగా..' అంటూ బక్క పలచని (జీరోసైజ్) అందాలతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ రియా చక్రవర్తి. తూనీగా బ్యూటీ అనే సార్ధక నామధేయురాలైంది. కానీ ఆ సినిమా తప్ప మరో తెలుగు సినిమాలో నటించింది లేదు. బాలీవుడ్లో ఒకటీ అరా సినిమాల్లో నటించింది. కానీ చెప్పుకోదగ్గవి కావు అవి కూడా.
అయితే ఇటీవల 'జలేబీ' అంటూ హీరోతో జిమ్నాస్టిక్ లిప్‌లాక్స్ చేసేసి, కాస్త పాపులర్ అయ్యింది. లేటెస్టుగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ హాట్ పిక్ పోస్ట్ చేసింది. 'నన్ను మిస్సయ్యారా.?' అంటూ కామెంట్ పెట్టింది. ఆ కామెంట్‌కీ, ఆ పిక్కీ నెటిజన్లు ఎలా కావాలంటే అలా వాడేసుకుని, ఆడేసుకుంటున్నారు.
ఇకపోతే ఈ జీరోసైజ్ హాటీకి తెలుగులో మరో ఛాన్స్ వచ్చిందని ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగా అల్లుడు కళ్యాణ్‌దేవ్ కొత్త చిత్రంలో రియా హీరోయిన్గా ఎంపికైందట. ఒకవేళ ఇది నిజమైతే మెగా కాంపౌండ్‌ని టచ్ చేసిన లక్కీ గాళ్స్‌లో రియా కూడా జాయిన్ అయిపోయినట్లే.