అందుకే విద్యాబాలన్‌ అంత స్పెషల్‌.!

By iQlikMovies - January 08, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు హీరోయిన్స్‌ అంత ఇంట్రెస్ట్‌ చూపించరు. బాలీవుడ్‌ హీరోయిన్స్‌ మరీను. అలాంటిది బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 'ఎన్టీఆర్‌' ప్రమోషన్స్‌లో విద్యాబాలన్‌ చాలా యాక్టివ్‌గా పాల్గొంటోంది. బాలయ్యతో కలిపి ఎక్కడ చూసినా విద్యాబాలన్‌ కనిపిస్తోంది. బాలయ్య సొంతూరు నిమ్మకూరులో 'ఎన్టీఆర్‌ - కథానాయకుడు' సినిమా ప్రమోషన్స్‌ని ఘనంగా నిర్వహించారు. అక్కడ బాలయ్యతో పాటు విద్యాబాలన్‌ కూడా సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 

 

తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా విద్యాబాలన్‌ సందడి చేసింది. రేపు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరిన ఎన్టీఆర్‌ బృందంతో విద్యాబాలన్‌ భక్తి శ్రద్ధలతో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. బాలయ్య, విద్యాబాలన్‌తో పాటు హీరో సుమంత్‌, నిర్మాత సాయి కొర్రపాటి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇకపోతే ఎన్టీఆర్‌లో స్వర్గీయ నందమూరి తారకరామారావు సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

ఈ బయోపిక్‌లో విద్యాబాలన్‌ది అత్యంత కీలకమైన పాత్ర. దాదాపు బాలయ్యతో సమానమైన పాత్ర అది. ప్రచార చిత్రాల్లో విద్యాబాలన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రమోషన్స్‌ విషయానికి వచ్చేసరికి విద్యాబాలన్‌ యాక్టివ్‌నెస్‌ని మెచ్చుకొని తీరాల్సిందే. ఏమంత ఖాళీగా ఉండే హీరోయిన్‌ కాదు విద్యాబాలన్‌. కానీ నటించడమే కాదు, డెడికేటెడ్‌గా తన సినిమాని ప్రమోట్‌ చేయడంలో కూడా విద్యాబాలన్‌ వ్యవహరిస్తున్న తీరుకు టాలీవుడ్‌ ఫిదా అవుతోంది. తెలుగులో విద్యాబాలన్‌ నటిస్తున్న తొలి చిత్రమిది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS