'గబ్బర్‌సింగ్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, లైమ్ లైట్‌లోకి వచ్చిన శృతిహాసన్ ఆ తర్వాత వరుస సక్సెస్‌లతో ఆకట్టుకుంది. కెరీర్‌లో ఇక తనకు తిరుగే లేదనిపించుకుంది. స్టార్ హీరోయిన్స్ రేసులో ముందు వరుస స్థానాన్ని ఆక్రమించింది. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ సత్తా చాటింది.
గత కొంతకాలంగా శృతిహాసన్ సినిమాలకు దూరమైంది. అయితే అందుకు రకరకాల కారణాలు గాసిప్స్‌గా ఆమె చుట్టూ చక్కర్లు కొట్టాయి. శృతిహాసన్ పెళ్లి చేసుకోబోతోందనీ, కాదు కాదు, తండ్రి కమల్‌హాసన్‌తో పాటు పొలిటికల్‌గా బిజీ కానుందనీ ఇలా బోలెడన్ని గాసిప్స్ హల్‌చల్ చేశాయి. అయితే ఈ గాసిప్స్‌కి చెక్ పెట్టేలా శృతిహాసన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోందన్న న్యూస్ ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. తెలుగులో ఓ సినిమాకి తాజాగా శృతిహాసన్ సైన్ చేసిందని తెలుస్తోంది.
ఈ సంగతి పక్కన పెడితే, ఇకపై శృతిహాసన్ గ్లామర్ క్యారెక్టర్స్ చేయనని ఫ్యాన్స్‌కి పెద్ద షాకే ఇచ్చింది. ఇకపై హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్నే ఎంచుకుంటుందట. అలాగే తనకు నచ్చితే ఇంపార్టెంట్ రోల్స్‌లో కూడా నటిస్తానని శృతిహాసన్ చెబుతుండడం విశేషం. తమిళంలో హీరోయిన్ సెంట్రిక్ మూవీ అయిన 'సంఘమిత్ర'లో నటించే ఛాన్స్ వదులుకుంది శృతిహాసన్. ఆ తర్వాత ఏ సినిమానీ అంగీకరించలేదు.
పెళ్లి చేసుకుని సెటిలైపోతేందేమో అని ఆశించిన అభిమానులకు అక్కడా నిరాశే మిగిలింది. ఇప్పుడప్పుడే శృతిహాసన్ పెళ్లి చేసుకోదట. కెరీర్‌లో తాను సాధించాల్సింది చాలా ఉందంటోంది. ఇకపై కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెడతానని చెబుతోంది అందాల శృతిహాసన్.