రీతూకు అందులో చోటు దక్కలేదే.!

By iQlikMovies - June 05, 2018 - 19:16 PM IST

మరిన్ని వార్తలు

'పెళ్లి చూపులు' సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ సంపాదించేసిన హీరోయిన్‌ రీతూ వర్మ. తర్వాత తెలుగులో 'కేశవ' చిత్రంలో నటించింది. తాజాగా ఈ బ్యూటీ తమిళ అగ్రహీరోల్లో ఒకరైన విక్రమ్‌ సరసన 'ధృవ నక్షత్రం' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 'పెళ్లి చూపులు' సినిమాతోనే ఈ బ్యూటీ ఈ అరుదైన ఆఫర్‌ కొట్టేసింది. 

ఇకపోతే లేటెస్టుగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తే అలా ఇలా లేదు. ఏకంగా హాలీవుడ్‌ రేంజ్‌ని తలపిస్తోందీ టీజర్‌. యాక్షన్‌ సీక్వెన్స్‌లో, కొన్ని చోట్ల గన్‌ షాట్స్‌ మతి పోగొట్టేస్తున్నాయి. రీతూ వర్మ ఈ సినిమాలో విక్రమ్‌కి లవర్‌గా నటిస్తోంది. అయితే తాజా టీజర్‌లో రీతూకు చోటు దక్కలేదు. రీతూతో పాటు, రాధిక, సిమ్రన్‌ తదితర సీనియర్‌ హీరోయిన్లు నటిస్తున్నారు. వీరి పాత్రలు స్పెషల్‌గా ఉన్నాయి. టీజర్‌లో ప్రత్యేకంగా వీరి ఎంట్రీ కనిపించింది. టీజర్‌ చూశాక సినిమాపై భారీగా అంచనాలు నమోదయ్యాయి. 

ఇంతకీ ఈ సినిమాని తెరకెక్కించేదెవరో తెలుసా? గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌. గౌతమ్‌ మీనన్‌ సినిమాలంటేనే ప్రత్యేక ఇంట్రెస్ట్‌ ఉంటుంది. ఎందుకంటే, రెగ్యులర్‌ ఫార్మేట్‌కి భిన్నంగా ఆయన చిత్రాలుంటాయి. అందుకే ఆయన సినిమాల్లో నటించాలని నటీ నటులు పోటీ పడుతుంటారు. హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా గౌతమ్‌ మీనన్‌ సినిమాల్లో నటించామన్న ఫీల్‌ని ఎంజాయ్‌ చేస్తుంటారు నటీనటులు. 

ఇకపోతే ఈ మధ్య హిట్లు లేక సతమతమవుతున్నాడు విక్రమ్‌. మరోవైపు తొలిసారి తమిళంలో నటిస్తున్న రీతూ వర్మకు 'ధృవనక్షత్రం' సక్సెస్‌నిస్తుందో లేదో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS