'పెళ్లి చూపులు' సినిమాతో పాపులర్ అయిన బ్యూటీ రీతూ వర్మ. అంతవరకూ హీరోయిన్‌కి ఫ్రెండ్‌గా, చెల్లెలిగా చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మకి 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోయిన్గా ఛాన్స్ దక్కింది. మామూలు ఛాన్సా అది. సెన్సేషనల్ విజయం అందుకుంది. దాంతో ఈ పాప క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత 'కేశవ' తదితర చిత్రాల్లో నటించింది. తమిళంలో ఏకంగా స్టార్ హీరో విక్రమ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో కొత్త సినిమాలకు సైన్ చేయలేదు కానీ, తమిళంలో అమ్మడి చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. గ్లామర్లోనూ అమ్మడు ట్రెండ్ సృష్టిస్తోందనడానికి ఈ తాజా పిక్ బెస్ట్ ఎగ్జామ్పుల్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ని తలపిస్తోంది రీతూ వర్మ అందం ఈ ఫోటోలో. మోడ్రన్ అండ్ స్టైలిష్ లుక్‌లో కెవ్వుకేక పుట్టిస్తోంది అందాల రీతూ వర్మ.