రంగస్థలం మూవీ కి పైరసీ దెబ్బ.. షాక్ లో మెగా ఫాన్స్..!

By iQlikMovies - April 02, 2018 - 20:10 PM IST

మరిన్ని వార్తలు

సినిమా పరిశ్రమని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్రధాన సమస్య పైరసీ. ఈ పైరసీ ఎంతలా పెరిగిపోయిందంటే సినిమా విడుదల అయిన రెండు మూడు రోజుల్లోనే పైరసీ ప్రింట్స్ బయటకి వచ్చేస్తున్నాయి. దీనితో సినిమా వసూళ్ళ పైన తీవ్ర ప్రభావం పడుతున్నది.

ప్రస్తుతం ఈ తలనొప్పి రామ్ చరణ్ రంగస్థలం సినిమాకి మొదలైంది. సినిమా విడుదలై మూడు రోజులు కాకముందే పైరసీ ప్రింట్స్ బయటకి వచ్చేశాయి. ఇప్పటికే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రానికి పైరసీ వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇక చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ విషయమై సైబర్ క్రైం పోలీసులకి సమాచారం ఇవ్వడం దానితో అంతర్జాలంలో ఈ లింక్స్ ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అభిమానులని కూడా ఇటువంటి పైరసీలని ప్రోత్సహించవద్దు అని యూనిట్ వారు ప్రచారం చేస్తున్నారు.

త్వరలోనే ఈ పైరసీ తగ్గుముఖం పట్టాలని కోరుకుందాం..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS