సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి అయిన మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం జరిగింది. దాదాపు 2 లక్షల మేరకు నగదు చోరీ కి గురైనట్లు తెలుస్తుంది. ఈ విషయం చిరంజీవి మేనేజర్ అయిన గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసారు.
చిరంజీవి ఇంట్లో గత పదేళ్లుగా పనిచేస్తున్న చెన్నయ్య అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తుంది. చిరు ఇంటి సమీపం లోని సిసి ఫుటేజ్ లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ కేసుకి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియాల్సి వుంది. ప్రస్తుతం చిరంజీవి తన 151 వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' షూటింగ్ పనుల్లో బిజీగా వున్నారు.