నటి స్నేహకి ఒక ప్రముఖ వ్యక్తి క్షమాపణలు చెప్పాడు.
ఇంతకి ఆయన ఎవరంటే- ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా. వివరాల్లోకి వెళితే, తమిళంలో ఈ మధ్యనే విడుదలైన వేలైక్కారన్ చిత్రంలో ఒక ప్రముఖ పాత్ర పోషించింది. అయితే సినిమా విడుదల అయ్యాక చూస్తే ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండడం జరిగింది. ఈ విషయమై నటి స్నేహకి ఆ డైరెక్టర్ పైన బాగా కోపం వచ్చిందని సమాచారం.
తాను ఈ చిత్రం కోసం 18 రోజులు కాల్షీట్స్ కేటాయిస్తే కనీసం 18 నిమిషాలు కూడా సినిమాలో తన పాత్ర కనపడకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ తరుణంలో డైరెక్టర్ మోహన్ రాజా ఈ అంశం పైన స్పందించారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక కొన్ని సన్నివేశాలని తొలిగించడం జరిగిందని అందులోనూ ఆమె పాత్రకి సంబందించిన సన్నివేశాలే ఎక్కువగా తోలిగించక తప్పలేదు అని అలా చేసినందుకు తాను క్షమాపణలు చెబుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.
మరి ఈ క్షమాపణతో స్నేహ సంతృప్తి చెందుతుందా లేదా అనేది స్నేహనే చెప్పాలి.