నందమూరి - బాలకృష్ణ రోజాలది సూపర్ హిట్ కాంబో. వీరిద్దరూ కలిసి నటించిన పలు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. పార్టీలు వేరయినా.. ఇద్దరూ బాగా క్లోజ్‌గా ఉంటారన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. అలాంటిది బాలయ్య ఆఫర్‌కు రోజా `నో` చెప్పిన వైనం ఒకటి వెలుగులోకి వచ్చింది.
'అన్ స్టాపబుల్'తో ఓటీటీ తెరపై బాలయ్య హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు `అన్ స్టాపబుల్ 2` కూడా సాగుతోంది. ఈ షోకీ మంచి రేటింగులు వస్తున్నాయి. ఈ షోకి రావాల్సిందిగా.... రోజాని బాలయ్య కోరాడట. ముందు `యస్` అన్న రోజా.... ఆ తరవాత బాలయ్య ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. దానికి కారణం... సీఎం జగన్ అని తెలుస్తోంది. బాలయ్య షోకి వెళ్లాలా? వద్దా? అంటూ జగన్ సలహా తీసుకొందట మంత్రి రోజా. జగన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో.. రోజా ఈ షోకి రాలేకపోయిందన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే అన్ స్టాపబుల్ లో.. పవన్ కల్యాణ్ అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ షో కోసం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.