మహానటి జరిగిన కథ, సావితఇ జీవిత చరిత్ర, రంగస్థం కల్పిత కథ, పోలిక ఎంతవరకూ సబబు? అనే విషయం పక్కన పెడితే, పాత జాఞపకాలల్లోకి రంగస్లం ఎలా చాలా మందిని తీసుకెళ్లిందో మహానటి కూడా అంతే.
'మహానటి'లో గెటప్స్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. వారిలో విజయ్ దేవరకొండ, సమంత గెటప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో సమంత జర్నలిస్టు మధురవాణి పాత్రలో నటిస్తుండగా, విజయ్ దేవరకొండ గెటప్ చూస్తే, రెండు మూడు దశాబ్థాల వెనక్కి వెళ్లిపోతాం. మెళ్లో కెమెరా, తలకి హెల్మెట్, స్కూటర్.. ఇలా ఇవన్నీ చూస్తే ఆటోమెటిగ్గా ఓ తరం వారు తమ పాత రోజుల్ని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. 'రంగస్థలం' ఈ జనరేషన్‌ని కూడా ముప్ఫై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయింది.
అలాగే 'మహానటి' కూడా ఆ రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉంది. అదో మహా అనుభూతి. ఇలాంటి సినిమాల్ని చూడగలమా అని 'రంగస్థలం' రిలీజ్ ముందు వరకూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే రిలీజ్ తర్వాత ఆ అనుమానాలు పటాపంచలైపోయాయి. ఆ రకంగా 'మహానటి' సినిమాకి 'రంగస్థలం' పరోక్షంగా హెల్ప్ చేసినట్లే అనిపిస్తోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. సావిత్రి భర్తగా దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, నాగచైతన్య, షాలినీ పాండే తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.