పూరి ఆకాష్ కథానాయకుడిగా నటించిన చిత్రం `రొమాంటిక్`. కేతిక శర్మ కథానాయిక. ఈ చిత్రానికి పూరి, ఛార్మి నిర్మాతలు. శుక్రవారం విడుదల అవుతోంది. రెండు రోజులకు ముందే... అంటే బుధవారం రాత్రి `రొమాంటిక్` ప్రీమియర్ షో వేశారు. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో `రొమాంటిక్` ప్రీమియర్లు పడ్డాయి. ఈ షోకి రాజమౌళి, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, దశరథ్, సత్యదేవ్, విశ్వక్‌సేన్... ఇలా చాలామంది టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. వాళ్లంతా ఈ సినిమాకి పాజిటీవ్ రివ్యూలు ఇచ్చారు.
`తెలుగు పరిశ్రమకు ఆకాష్ లాంటి మరో మంచి నటుడు దొరికాడు` అని రాజమౌళి కితాబిచ్చాడు. ``క్లైమాక్స్ లో ఆకాష్ నటన బాగుంది. తన పై చాలా ధైర్యంగా క్లోజ్ పెట్టాడు దర్శకుడు. పూరి రాసుకున్న కథకు న్యాయం చేశారు`` అని రాజమౌళి రివ్యూ ఇచ్చాడు. `డైలాగులు అదిరిపోయాయి` అని అనిల్ రావిపూడి చెప్పేశాడు. కుర్రాళ్లకు పండగలాంటి సినిమా అని విశ్వక్ సేన్ అన్నాడు. ఆకాష్ - కేతికల జంట ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. రొమాంటిక్ టైటిల్ కి తగ్గట్టుగానే పూరి.. ఈసినిమాలో రొమాన్స్ బాగా చూపించాడట. ఆయా సన్నివేశాలన్నీ కుర్రకారుని థియేటర్లకు రప్పించేలా ఉంటాయని ఈ సినిమా ప్రీమియర్స్ కి వెళ్లినవాళ్లంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. మరి ప్రేక్షకులు ఏమంటారో?