'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ, ఛార్మీ నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రొమాంటిక్'. ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిల్ పాడూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గత 30 రోజులుగా గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ ఇక ఇండియాకి తిరిగి రానుంది. ఈ థర్టీ డేస్‌లో అక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్‌తో పాటు, బీచ్‌లో యాక్షన్ ఘట్టాలు చిత్రీకరించారట. ఏ సినిమాకైనా గోవా లొకేషన్స్ అంటే ఆ కిక్కే వేరు. అలాంటిది, పూరీ సినిమాల్లో గోవా లొకేషన్స్‌కి సమ్‌థింగ్ స్పెషల్ హిస్టరీ ఉంటుంది.
సెంటిమెంట్ పరంగా కూడా పూరీకి గోవా బాగా కలిసొచ్చిన అంశం. అందుకే సెంటిమెంట్ తప్పకుండా, గోవా బీచ్‌ని కొడుకు సినిమా కోసం బాగా వాడేశాడట. హీరోయిన్ కేతికా శర్మ పరిచయానికి ముందే, సోషల్ మీడియాలోని అందాల ఆరబోతతో బోలెడంత ఫాలోయింగ్ సంపాదించేసింది. ఇక ఇలాంటి పాప పూరీ సినిమాల్లో అంటే, హాట్ అప్పీల్ ఏ రేంజ్లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు.
ఆల్రెడీ ఫస్ట్‌లుక్ పేరు చెప్పి రిలీజ్ చేసిన పాప టాప్‌లెస్ పోజు కాక రేపేసింది. ఖచ్చితంగా సినిమాకి అమ్మడి అందచందాలు ప్లస్ అవుతాయనడం అతిశయోక్తి కాదేమో. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గోవా షెడ్యూల్లో రమ్యకృష్ణ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.