ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జైలవకుశ చిత్రం గురించిన లేటెస్ట్ న్యూస్ బయటికి వచ్చింది.
తెలుస్తున్న వివరాల ప్రకారం, బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ని ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో ప్రతినాయకుడు పాత్రకి ఎంపిక చేశారట. రోనిత్ రాయ్ అంతటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని తీసుకోవడంతో ఈ సినిమా రేంజ్ అమాంతం పెరిగింది అనడంలో ఎటువంటి సందేహంలేదు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ గెటప్ కి సంబంధించి మేకప్ టెస్ట్స్ కూడా పూర్తయ్యాయి.
మొత్తంగా ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఒక మైలురాయి చిత్రంగా నిలిచిపోనుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.