దిల్ రాజు సోదరుడు కొడుకు ఆశీష్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా `రౌడీ బోయ్స్`. ఈ సినిమా కోసం దిల్ రాజు బాగానే ఖర్చు పెట్టారు. ఆశీష్ తొలి సినిమానే అయినా బడ్జెట్ విషయంలో వెనుకంజ వేయలేదు. దాదాపు 20 కోట్లతో ఈ సినిమాని తీర్చిదిద్దారు. సంక్రాంతి సీజన్, పైగా యూత్ ఫుల్ మూవీ కాబట్టి.. వసూళ్లు బాగానే వస్తాయని ఆశించారు.
కానీ... ఫలితం రివర్స్‌కొట్టింది. సినిమాలో విషయం లేకపోవడంతో... ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. మరోవైపు బంగార్రాజు జోరు చూపించడం వల్ల ఆ సినిమా ముందు రౌడీ బోయ్స్ వెలవెలబోయింది. ఇప్పటి వరకూ ఈ సినిమా కనీసం రూ10 కోట్లమైలు రాయికి కూడా చేరుకోలేకపోయింది. ఈ సినిమా కోసం 20 కోట్లు ఖర్చు పెట్టారంటే.. సగం పోయినట్టు లెక్క. దిల్ రాజు లాంటి నిర్మాతకు రూ.10 కోట్లు పోవడం పెద్ద మేటరేం కాదు. ఓటీటీ, శాటిలైట్ రూపంలో..ఆ డబ్బుని రాబట్టుకుంటాడు. కాకపోతే.. ఆశిష్ కి తొలి సినిమాతోనే హిట్టు ఇవ్వాలన్న కోరిక నెరవేరలేదు. ఎంత భారీ ప్రమోషన్లు కల్పించినా ప్రయోజనం లేకపోయింది. అయితే ఆశిష్ రెండో సినిమా విషయంలో ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించేశారు. సుకుమార్ శిష్యుడితో ఆశిష్‌రెండో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. సుకుమార్ హ్యాండ్ తోడైంది కాబట్టి... ఆశిష్‌కి అదే బ్యాక్ బోన్ గా మారుతుంది. తొలి సినిమాతో పోయిందంతా రెండో సినిమాలో దక్కించుకునే ఛాన్స్ ఉన్నట్టే.