ఆలియాభట్‌ది ఎంత పెద్ద మనసో.!

మరిన్ని వార్తలు

త్వరలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న ముద్దుగుమ్మ ఆలియాభట్‌ పేరు తెగ మార్మోగిపోతోందిప్పుడు టాలీవుడ్‌లో. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కి జోడీగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో ఆలియాభట్‌ కన్‌ఫామ్‌ అయ్యిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆలియా కోసం ఏ చిన్న న్యూస్‌ తెలిసినా తెలుగు ఫ్యాన్స్‌ ఎంతో ఆశక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల బర్త్‌డే జరుపుకున్న ఆలియాభట్‌ తన బర్త్‌డేకి తన వద్ద పని చేసే డ్రైవర్‌కీ, హెల్పర్‌కీ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్స్‌ ఇచ్చిందట. 

 

అదేంటో తెలుసా.? అక్షరాలా 50 లక్షల రూపాయల చెక్‌ అన్న మాట. ఇద్దరినీ చెరో 25 లక్షలు తీసుకొమ్మని ఆలియాభట్‌ సూచించిందట. హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసినప్పటి నుండీ, తనకు సహాయంగా ఉంటూ, తనను జాగ్రత్తగా చూసుకుంటోన్న సునీల్‌, అన్మోల్‌ ఆలియాభట్‌ ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారట. ఆ డబ్బుతో సొంతంగా చిన్న ఫ్లాటులు కొనుక్కున్నారట. అలాగే తన బర్త్‌డే పేరు చెప్పి ఆలియాభట్‌ మిగిలిన పని వాళ్లకీ గిఫ్ట్స్‌ ఇచ్చిందట. అంతేకాదు వారికి ఎప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా ఆలియా అండగా ఉంటుందట. ఆలియాది ఎంత పెద్ద మనసో కదా. 

 

ఇకపోతే బాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా గడుపుతూనే, తెలుగులో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీకి సైన్‌ చేసింది ఆలియాభట్‌. త్వరలోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌లో ఆలియాభట్‌ పాల్గొననుందని సమాచారమ్‌. ఇదిలా ఉంటే, బాలీవుడ్‌లో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఒకటి ఇటీవలే కన్‌ఫామ్‌ అయ్యిందట ఆలియాకి. ఎప్పటి నుండో సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్షన్‌లో నటించాలన్న ఆలియా కోరిక త్వరలో నెరవేరబోతోందట. సల్మాన్‌ఖాన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS