కాస్టింగ్ కౌచ్ పేరు చెప్పి అర్ధ నగ్న ప్రదర్శనతో సినీ పరిశ్రమ పరువును బజారుకీడ్చిన నటి శ్రీరెడ్డి. తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖుల జాతకాలు బయటపెడుతున్నానంటూ అసభ్యకర ఆరోపణలతో రెచ్చిపోయిన శ్రీరెడ్డికి ఆశించిన పబ్లిసిటీ దక్కలేదు. వీరూ, వారూ అనే తేడా లేకుండా టాలీవుడ్‌తో పాటు, కోలీవుడ్ ప్రముఖులపైనా శ్రీరెడ్డి నోరు పారేసుకుంది.
అయితే దగ్గుబాటి ఫ్యామిలీని మాత్రం వీడని నీడలా వెంటాడుతూనే ఉంది శ్రీరెడ్డి. దగ్గుబాటి ఫ్యామిలీ మాత్రం ఆమెను వీసమెత్తైనా లెక్క చేయడం లేదు. దగ్గుబాటి వారసుడు అభిరామ్ తనను మోసం చేశాడంటూ జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తూ కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్యాష్ చేసుకోవాలని ఆశపడిన శ్రీరెడ్డి ఆశలు నిరాశలే అయ్యాయి. అయినా శ్రీరెడ్డి గుర్తొచ్చినప్పుడల్లా అభిరామ్‌పై ఆరోపణలు చేస్తూనే ఉంది.
తాజాగా 'పీజియన్ క్లబ్'లో అభిరామ్ తనకు పబ్లిగ్గా లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడంటూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఎంత చేసినా దగ్గుబాటి ఫ్యామిలీ శ్రీరెడ్డిని పట్టించుకోవడం లేదు. అయినా కానీ తన ప్రయత్నాలు మానడం లేదు. ఆ ఫ్యామిలీకి వీలైనంత ఎక్కువ డ్యామేజ్ చేద్దామని వీలు చిక్కినప్పుడల్లా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ శ్రీరెడ్డి వాదన అరణ్య రోదనే అవుతోంది. తాజా పోస్ట్ పరిస్థితి కూడా అంతేగా.. అంతేగా..!