`మండే` పరీక్షలో పాసైపోయింది ఆర్.ఆర్.ఆర్. ఈనెల 25న `ఆర్.ఆర్.ఆర్` విడుదలైన సంగతి తెలిసిందే. తొలి మూడు రోజుల్లో రికార్డు వసూళ్లు సాధించింది. ఏకంగా రూ.500 కోట్లు దాటేసి - బాక్సాఫీసుని షేక్ చేసింది. అయితే సోమవారం ఈ సినిమా పరిస్థితేంటని చాలామంది ఎదురు చూశారు. ఎంత పెద్ద సినిమా అయినా, సోమవారం నుంచి వసూళ్లు డ్రాప్ అవుతాయి. సగానికి సగం పడిపోతాయి. కానీ... సోమవారం కూడా మంచి వసూళ్లనే రాబట్టింది.. ఆర్.ఆర్.ఆర్. నాలుగో రోజు దాదాపుగా రూ.17.5 కోట్లు సాధించింది. నిజంగా... ఇవి మంచి అంకెలే. ఈ లెక్కతో.. తొలి 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 155 కోట్ల వసూళ్లు సాధించినట్టైంది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లెక్కలు రావాల్సివుంది.
ఈ సినిమాకి రూ.600 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఈ వారాంతానికి బ్రేక్ ఈవెన్ అయిపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డివైడ్ టాక్ వచ్చినా, బాలీవుడ్ ఈ సినిమా గురించి అంతగా పట్టించుకోకపోయినా - ఈ స్థాయి వసూళ్లు రావడం ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇద్దరు హీరోలు కలిసి చేసిన సినిమా ఇది. అందుకే ఇంత మానియా.