బాహుబలితో దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసింది. ఇప్పుడు RRR తో మరోసారి టాలీవుడ్ జెండాని రెపరెపలాడించాలనుకుంటున్నాడు రాజమౌళి. దక్షిణాదిన రూపొందిన భారీ బడ్జెట్ చిత్రాలలో ఇదొకటి. రామ్ చరణ్. ఎన్టీఆర్ కలిసి నటించారు. అలియాభట్ కథానాయిక. అజయ్ దేవగణ్ కీలక పాత్రధారి. జనవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈరోజు... RRR నుంచి 45 సెకన్ల నిడివి గల గ్లింమ్స్ బయటకు వచ్చింది.
ఈ 45 సెకన్లూ.. అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది వీడియో.చరణ్, ఎన్టీఆర్‌లు పక్క పక్కన కనబడలేదు గానీ, ఆ భారీదనం, ఆ హంగామా చూస్తే, బాహుబలిని తలదన్నే సినిమా వస్తున్నట్టే అనిపించింది. రాజమౌళి విజువల్స్‌కి కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్‌ఫెక్ట్ గా కుదిరింది. అయితే ఈ గ్లింమ్స్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం... కాస్త నిరాశను కలిగిస్తోంది. త్వరలోనే ఓ పూర్తి స్థాయి టీజర్ ని చూడాలన్నది అభిమానుల ఆశ. అదెప్పుడు తీరుతుందో చూడాలి. ఈలోగా RRR ప్రమోషన్లను మొదలెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. అందులో భాగంగా త్వరలోనే.. ఓ వేడుక నిర్వహించే ఛాన్స్ వుంది.