'ఆర్‌.ఆర్‌.ఆర్'‌... ముందే వ‌చ్చేస్తోంది

మరిన్ని వార్తలు

రాజ‌మౌళి సినిమా అంటే అది పంచ వర్ష ప్ర‌ణాళిక అయిపోయింది. దాదాపు రెండు మూడేళ్లు సెట్స్‌పై ఉండాల్సిందే. రిలీజ్ డేట్ చెప్తారు కానీ, ఆ టైమ్ కి సినిమా విడుద‌ల అవ్వ‌డం అసాధ్యం. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ఈ యేడాది జూన్‌లో రావాల్సిన సినిమా ఇది. క‌రోనా వ‌ల్ల‌.. విడుద‌ల సాధ్యం కాలేదు. 2021 వేస‌వికి వ‌స్తుంద‌ని అంచ‌నా. కానీ.. వేస‌వికి రాద‌న్న‌ది వాస్త‌వం. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` 2022 సంక్రాంతికే అనే టాక్ వినిపిస్తోంది. అప్ప‌టికీ క‌ష్ట‌మే అన్న‌ది కొంత‌మంది వాద‌న‌.

 

అయితే అలా అనుకునేవాళ్లంద‌రికీ రాజ‌మౌళి షాక్ ఇచ్చే పనిలో ఉన్నారు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`ని 2021 ద‌స‌రాకే సిద్ధం చేస్తార‌ని టాక్‌. అక్టోబ‌రు - నవంబ‌రు నాటికి `ఆర్‌.ఆర్‌.ఆర్‌`ని రిలీజ్ చేసేస్తార్ట‌. ఏప్రిల్ నాటికి.. షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఆగ‌స్టు నాటికి ఫ‌స్ట్ కాపీ సిద్ధం చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు ఇద్ద‌రినీ ఏప్రిల్ నుంచి ఈ సినిమా నుంచి విముక్తుల్ని చేస్తార‌ని, మే నుంచి మ‌రో సినిమాకి కాల్షీట్లు ఇచ్చుకోమ‌న్నార‌ని స‌మాచారం అందుతోంది. అంటే `ఆర్‌.ఆర్‌.ఆర్‌` 2021లోనే చూసేయొచ్చన్న‌మాట‌. ఇది సినీ అభిమానుల‌కు గుడ్ న్యూసే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS