మహేష్‌బాబు తాను పనిచేసిన దర్శకులనే మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తుంటాడు. పూరి జగన్నాథ్‌తో రెండు సినిమాలు చేశాడు. శ్రీనువైట్లకూ రెండుసార్లు ఛాన్సిచ్చాడు. కొరటాల శివతో రెండు సినిమాలు చేశాడు. వంశీపైడిపల్లితో రెండోసారి పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆ లిస్టులో అనిల్‌రావిపూడి కూడా చేరబోతున్నాడనిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' మంచి విజయాన్ని అందుకుంది. అందుకే అనిల్‌తో మరో సినిమా చేయాలని మహేష్ ఉత్సాహం చూపిస్తున్నాడు. అనిల్‌పై మహేష్‌కి మంచి నమ్మకం కుదిరింది.
ఈ సినిమా విజయాన్ని పూర్తిగా అనిల్ రావిపూడికే కట్టబెడుతున్నాడు మహేష్. ఎక్కడకు వెళ్లినా అనిల్ గురించి గొప్పగా చెబుతున్నాడు. 'మరో కథ తయారు చేసుకో. త్వరలోనే కలసి పనిచేద్దాం' అని మహేష్ మాటిచ్చేశాడట. మహేష్ మాటిస్తే ఇక తిరుగుండదు. సో.. వీరిద్దరి కాంబోని మరోసారి చూడొచ్చన్నమాట.