అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు 'తానా' తదితర సభలు కొత్త జోష్‌ని నింపుతుంటాయి. అప్పుడప్పుడూ ఇక్కడి మన సెలబ్రిటీలు ఈ తానా సభల్లో పాల్గొని అక్కడి మన తెలుగువారిని లైవ్‌గా ఎంటర్‌టైన్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలో తానా సభలు మొదలయ్యాయి. జూలై 4 నుండి 6 వరకూ తానా సభలు జరగనున్నాయి.
ఈ సభలకు జక్కన్న రాజమౌళి హాజరవుతాడంటూ వార్తలు వచ్చాయి. ఈ గాసిప్స్‌కి కారణం ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉండడమే. అయితే, ఈ విషయమై జక్కన్న సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాను అమెరికాకి పర్సనల్ పని మీద వచ్చాననీ, తానా సభల్లో తాను పాల్గొనడం లేదనీ, నేను అక్కడికి వస్తానని ఎదురు చూసే నా అభిమానులు నిరాశ చెందకూడదనే నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను.. అని జక్కన్న తెలిపారు. జక్కన్న క్లారిటీ ఇచ్చారు కానీ, ఈ క్లారిటీపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
తానా కన్వెన్షన్ కోసం కాక, రాజమౌళి అమెరికాకి వెళ్లాల్సిన అవసరమేమంత వచ్చిందంటూ అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బహుశా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ కోసమే ఆయన అమెరికా పర్యటన ప్లాన్ చేశారా.? అన్నది కూడా ఓ అభిప్రాయం. ఏమో మొత్తానికి ఏదేమైతేనేం, జక్కన్న యూఎస్ టూర్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.