పెళ్లయ్యాక సమంత పూర్తిగా మారిపోయింది. నాయికా ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. ప్రయోగాలు చేస్తోంది. అందుకే యూటర్న్, ఓ బేబీ లాంటి సినిమాల్ని ఒప్పుకుంటోంది. తనలోని నటిని ఎప్పటికిప్పుడు కొత్తగా చూపించాలని తాపత్రయపడుతోంది. అందుకోసం కొత్త కొత్త కలలు కంటోంది. సమంత చేయాలనుకున్న పాత్రలు చాలానే ఉన్నాయి. పని చేయాలనుకుంటున్న దర్శకుల జాబితా కూడా ఉంది.
సమంతకి శేఖర్ కమ్ములతో పనిచేయాలని ఆశగా ఉందట. మణిరత్నం కూడా తన డ్రీమ్ డైరెక్టర్ అంటోంది. ''శేఖర్ కమ్ముల కథలు బాగుంటాయి. కథానాయిక పాత్రని సహజంగా అందంగా చూపిస్తారు. ఇక మణిరత్నంసార్తో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.
ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలీదు'' అని చెప్పుకొచ్చింది. సమంతకంటే ఆ అవకాశం ముందు నాగచైతన్యకే దక్కింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య ఓసినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి పల్లవి కథానాయిక. సమంత మనసులోని మాట ముందే తెలిస్తే... శేఖర్ కమ్ముల సమంతనే ఎంచుకునేవాడేమో..?