‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆ గాసిప్ నిజమేనా.?

మరిన్ని వార్తలు

 ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఒక్క ఫోటోతో సెన్సేషనల్‌ కాంబినేషన్‌కి శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌ ఇది. జక్కన్న రాజమౌళి సృష్టించబోయే మరో అద్భుతం. ఊరించినన్ని రోజులు ఊరించారు కానీ, ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్స్‌ డేకే సినిమా విశేషాలన్నీ పూస గుచ్చినట్లు చెప్పేశారు, రిలీజ్‌ డేట్‌తో సహా. కానీ, ఇటీవలే రిలీజ్‌ డేట్‌ హుష్‌ కాకి అయిపోయింది. ఈ ఏడాది రిలీజ్‌ కావల్సిన సినిమా కాస్తా వచ్చే ఏడాదికి వెళ్లిపోయింది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం, అన్నట్లుగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడ్డానికి కూడా అనేక కారణాలు తన్నుకొచ్చేస్తున్నాయి. దాంతో నటీ నటుల కాల్షీట్ల ఇబ్బంది ఎదురవుతోందనే ప్రచారం ఓ వైపు ఉండగా, ప్రస్తుతం కరోనా రూపంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌కి మరోసారి బ్రేకులు పడ్డాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి అలియాభట్‌ ఈ సినిమా నుండి తప్పుకుంటోందన్న గాలి వార్త పుట్టుకొచ్చేసింది.

 

అయితే, కరోనా తాకిడి కేవలం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’నే కాదు, యావత్‌ ప్రపంచంతో పాటు, సినీ ప్రపంచాన్నే కుదిపేస్తోంది. సో కాల్షీట్టు ప్రాబ్లెమ్‌ అనే సమస్య పెద్ద ప్రాబ్లెమ్‌ కాకపోవచ్చు. ఈ సినిమాలో చాలా మంది విదేశీ నటీ నటులు నటిస్తున్నారు. మన దేశంలోనే కాక, విదేశాల్లోనూ కరోనా పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. సో కరోనా కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి గుడ్‌ బై చెప్పేసే నటీ నటుల జాబితా తూచ్ అనే అనుకోవాలి. అలాంటిది బాలీవుడ్‌ నటి అలియా గుడ్‌ బై చెప్పేస్తుందట.. అనే వార్తలో పెద్దగా నిజం లేకపోవచ్చనేది సినీ మేధావుల అభిప్రాయం. ఇకపోతే, బాలీవుడ్‌లో సినీ జనమంతా కరోనా పేరు చెప్పి ప్రస్తుతం షూటింగ్స్‌కి బ్రేకప్‌ చెప్పేసి, చక్కగా ఇంటి పట్టున ఉండి, కాలక్షేపం చేస్తున్నారన్నా వార్త మాత్రం నిజంగా నిజం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS