#RRR సినిమా షురు...

By iQlikMovies - November 11, 2018 - 12:28 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు చిత్రసీమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న #RRRకి సంబంధించిన లాంచ్ కొద్దిసేపటి క్రితమే జరిగింది. సరిగ్గా ఉదయం 11.11 గంటలకు పూజా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా, రాఘవేంద్రరావు #RRR స్క్రిప్ట్ ని హీరోలు చరణ్-తారక్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య లకి అందచేశారు. ఇక ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్, రానా, కొరటాల శివ, అల్లు అరవింద్, జెమినీ కిరణ్, సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, బాహుబలి నిర్మాతలు వంటి వారు ముఖ్యఅతిధులుగా హాజరవ్వడం జరిగింది.

దీనితో ఈ సినిమా అధికారికంగా మొదలయినట్టే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి కీరవాణి స్వరాలూ సమకూరుస్తుండగా, సెంథిల్ కెమరామెన్ గా వ్యవహరించనున్నారు. దాదాపుగా రాజమౌళి గత సినిమాలకి పనిచేసిన టెక్నికల్ టీం ఈ సినిమాకి కూడా పనిచేయనున్నారు.

ఏదేమైనా.. తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక నవ యువ మల్టీస్టారర్ గా తెరకెక్కనుంది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS