రాజమౌళి సినిమా అంటే... సుదీర్ఘ ప్రాజెక్ట్ అని అందరికీ తెలిసిందే. తన సినిమా కనీసం 300 కోట్ల బడ్జెట్ తో ముడిపడిన వ్యవహారం. పాన్ ఇండియా వ్యాపారం కావడం వల్ల... ఏరకంగా చూసినా ఆచి తూచి అడుగులేయాలి. అందుకే రాజమౌళి సినిమా ఆలస్యం అవుతుంటుంది. పైగా... విజువల్ ఎఫెక్ట్స్ తో పని ఎక్కువ. అవెప్పుడు పూర్తవుతాయో తెలీదు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. షూటింగులన్నీ ఆగిపోయాయి. అలా.. ఆర్.ఆర్.ఆర్ కి కష్టాలు మరింత ముదిరాయి.
అక్టోబరు 13న ఆర్.ఆర్.ఆర్ విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. మొన్న ఎన్టీఆర్ పుట్టిన రోజుకి విడుదల చేసిన కొత్త పోస్టర్ లోనూ.. అదే డేట్ ఉంది. అంటే.. అక్టోబరు 13నే ఈ సినిమా వచ్చేయాలి. కానీ.. ఇది అనుకున్నంత సులభం కాదు. ఈ యేడాది ఆర్.ఆర్.ఆర్ విడుదలయ్యే ఛాన్స్ లేదని తేలిపోయింది. కనీసం 2022 సంక్రాంతికైనా వస్తుందనుకుంటే... అదీ కుదరని పని అని తేలింది.
ఈ సినిమాని 2022 వేసవికే విడుదల చేయబోతున్నారని, ఈ విషయాన్ని రాజమౌళి తన టీమ్ కి చెప్పేశారని, 2022 వేసవి సీజన్... ఆర్.ఆర్.ఆర్ కి పర్‌ఫెక్ట్ అని రాజమౌళి నమ్ముతున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్. అంటే.. 2022 ఏప్రిల్, మేలలో... ఈ సినిమా వచ్చే ఛాన్సుందన్నమాట. మరో విషయం ఏమిటంటే.. ఆర్.ఆర్.ఆర్‌కి సంబంధించిన షూటింగ్ మరో 40 రోజులు ఉందట. అది పూర్తి చేస్తే గానీ, విడుదల తేదీపై ఓ క్లారిటీ రాదని తెలుస్తోంది. అటు మెగా ఫ్యాన్స్ కీ, ఇటు నందమూరి ఫ్యాన్స్‌కీ ఇది చేదు వార్తే.