ఐకాన్.... ఈ ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు సినీ జనాలు. `ఇదిగో.. అదిగో` అంటున్నారు తప్ప, సెట్టయ్యింది, సెట్స్‌పైకి వెళ్లిందీ లేదు. అల్లు అర్జున్ కోసం వేణు శ్రీరామ్ ఈ కథ తయారు చేశాడు. బన్నీ కూడా ఓకే అన్నాడు. దిల్ రాజు... నిర్మాతగా ఫిక్సయ్యాడు. కానీ... వర్కవుట్ అవ్వడమే లేదు. వకీల్ సాబ్ చూశాక.. బన్నీ మనసు మార్చుకున్నాడని, వేణు శ్రీరామ్ తో పనిచేయడానికి రెడీ అయ్యాడని వార్తలొచ్చాయి. అయితే.. అది కూడా తుస్సుమంది. వేణు శ్రీరామ్ సైతం దిల్ రాజు కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేశాడని చెప్పుకున్నారు. అంటే.. ఐకాన్ కోసం హీరోనే కాదు. ఇప్పుడు నిర్మాత కూడా మారాడన్నమాట.
అవును.. ఐకాన్ ప్రాజెక్టు మరోసారి డైలామాలో పడింది. బన్నీ ఈసినిమా చేయనని ఖరాఖండిగా చెప్పేశాడట. దాంతో వేణు శ్రీరామ్ ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పుడు ఈ కథని ఒప్పించాలంటే, వేణు ముందుగా హీరోని పట్టుకోవాలి. ఆ తరవాత నిర్మాత ఎలాగూ వస్తాడు. కాదంటే కొత్త కథ రాసుకోవాలి. ఏళ్ల తరబడి ఐకాన్ పై మమకారం పెంచుకున్న వేణు శ్రీరామ్.... ఐకాన్ కథని పక్కన పెట్టగలడా? అనేది సందేహమే.ఎప్పుడో ఒకప్పుడు ఈ కథకు హీరో దొరక్కపోడా... అన్న ఆశతో ఎదురుచూస్తున్నాడు వేణు. మరి ఆ అన్వేషణ ఎప్పటికి ఫలిస్తుందో?