రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్' (టైటిల్ ఇంకా ఖరారు ఖాలేదు) సినిమాకి సంబంధించి బంపర్ గాసిప్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది సినీ వర్గాల్లో. ఈ సినిమాకి సంబంధించి శాటిలైట్ రైట్స్‌పై 150 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందట. జీ సంస్థ నుంచి వచ్చిన ఈ ఆఫర్ తెలుగు సినీ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శాటిలైట్‌తోపాటు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ రైట్స్‌ని, మ్యూజిక్ రైట్స్‌నీ కలిపి 150 కోట్ల ఫిగర్‌ని ఫైనలైజ్ చేసిందట 'జీ' సంస్థ. అయితే, నిర్మాత డివివి దానయ్య మాత్రం ఈ క్రేజీ ఆఫర్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోకపోయినా, ఇంతకంటే భారీ ఆఫర్‌ని బహుశా దానయ్య ఆశించకపోవచ్చు గనుక, కన్‌ఫామ్ చేసే అవకాశాలే ఎక్కువ. 'బాహుబలి' దెబ్బకి మొత్తంగా తెలుగు సినిమాపై భారతీయ సినీ వర్గాల్లో ఆలోచనలే మారిపోయాయి. తెలుగు సినిమాకి సంబంధించినంతవరకు ఆర్‌ఆర్‌ఆర్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వార్తలోకెక్కింది. దాంతో 150 కోట్ల ఆఫర్ అనేది మరీ ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదేమోననేవారూ లేకపోలేదు.
సౌత్‌కి సంబంధించినంతవరకు రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన '2.0' సినిమా మాత్రమే 100 కోట్ల మార్క్ దాటింది. ఈ సినిమాకి 108 కోట్ల మేర ఆఫర్ సెట్ అయ్యింది శాటిలైట్ పరంగా. దాన్ని మించి అసలు సిసలు రికార్డ్‌ని 'ఆర్‌ఆర్‌ఆర్' సొంతం చేసుకున్నట్లవుతుంది నిర్మాత దానయ్య ఈ ఆఫర్‌ని ఓకే చేస్తే.