#RRR ఓవ‌ర్సీస్‌కి అదిరిపోయే రేటు!

మరిన్ని వార్తలు

బాహుబ‌లి రికార్డుల‌న్నీ #RRR బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. #RRR విడుద‌ల త‌ర‌వాత ఎన్ని సంచ‌ల‌నాలు సాధిస్తుందో తెలీదు గానీ, విడుద‌ల‌కు ముందు బిజినెస్ రూపంలో మాత్రం భారీ ప్ర‌కంప‌నాలు సృష్టిస్తోంది. 20 శాతం షూటింగ్ జ‌ర‌క్కుండానే #RRR బిజినెస్ మొద‌లైపోయిందంటే - రాజ‌మౌళి స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవొచ్చు. తాజాగా ఓవ‌ర్సీస్ డీల్ కూడా క్లోజ్ అయిపోయిన‌ట్టు టాక్‌. #RRR ఓవ‌ర్సీస్ రేటు రూ.65 కోట్ల‌కు అమ్ముడైపోయిన‌ట్టు స‌మాచారం. ఓ బ‌డా వ్యాపార వేత్త‌.. ఓవ‌ర్సీస్ హ‌క్కుల్ని హోల్ సేల్‌గా కొనుక్కున్నాడ‌ట‌. చైనా మిన‌హా అన్ని దేశాల్లోనూ, అన్ని భాష‌ల్లోనూ #RRR ని విడుద‌ల చేసుకోవొచ్చు. అందుకు గానూ రూ.65 కోట్ల‌కు బేరం కుదిరిపోయింది.

 

ఓ విధంగా చూస్తే... తెలుగులో ఓ సినిమా ఓవ‌ర్సీస్‌కు ఈ స్థాయిలో అమ్ముడుపోవ‌డం ఇదే ప్ర‌ధ‌మం. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టించే ఈ చిత్రంలో అలియాభ‌ట్ క‌థానాయిక‌. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు దాదాపు అన్ని ప్రాంతీయ భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. నైజాం హ‌క్కుల కోసం కూడా ప్ర‌స్తుతం బేర‌సారాలు సాగుతున్నాయి. ఈ డీల్ కూడా తొంద‌ర్లోనే ఫైన‌లైజ్ అయ్యే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS