'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌కి 'ఆ' రోజు హాలీడే.!

By Inkmantra - December 20, 2019 - 08:20 AM IST

మరిన్ని వార్తలు

ఏంటి స్పెషల్‌.? అనుకుంటున్నారా.? జక్కన్నకు అన్న కీరవాణి తనయులు డెబ్యూ చేస్తున్న మూవీ ఆ రోజు రిలీజ్‌ అవుతోంది. అదేనండీ, క్రిస్‌మస్‌ రోజు డిశంబర్‌ 25న 'మత్తు వదలరా' సినిమా ప్రేక్షకుల ముందు వస్తోంది. తన కుమారులు ఇద్దరూ ఒకేసారి తెరంగేట్రం చేస్తున్న సినిమా అది. సో అది మాకు చాలా చాలా స్పెషల్‌. అందుకే ఆ రోజు మా సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ 'మానేస్తా..' అంటూ రాజమౌళి ఎమోషనల్‌గా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ డైరెక్టర్‌ రాకుంటే, షూటింగ్‌కి హాలీడేనే కదా. అందుకే 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ మొత్తానికీ ఆ రోజు సెలవు రోజన్నమాట.

 

ఇకపోతే, 'మత్తు వదలరా' ట్రైలర్‌కి సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జనంలోనూ ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. మార్కెటింగ్‌ వేల్యూస్‌ బాగా తెలిసిన రాజమౌళి అన్న కొడుకులు ఎంట్రీ ఇస్తున్న మూవీ అంటే, పబ్లిసిటీ ఆ రేంజ్‌లోనే ఉండాలి మరి. అందుకే ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ నుండీ పబ్లిసిటీ అదే రేంజ్‌లో జరుగుతోంది. సినిమాలో కంటెంట్‌ కూడా ఆసక్తికరంగా ఉండడంతో, కీరవాణి తనయులకు డెబ్యూ కలిసొచ్చేలానే ఉంది. శ్రీ సింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. రితీష్‌ రానా దర్శకుడు. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో సినిమా రూపొందింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS