'ఆర్‌ఆర్‌ఆర్‌' రోలింగ్‌ ప్రారంభమైంది.!

By iQlikMovies - November 19, 2018 - 16:22 PM IST

మరిన్ని వార్తలు

రాజమౌళి సినిమా. అందులోనూ మెగా ప్రాజెక్ట్‌. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇద్దరి కాంబినేషన్‌లో మల్టీ స్టారర్‌. ఒక్క పిక్‌తో మొదలైన ఈ సెన్సేషన్‌ ఇప్పుడు సెట్స్‌ వరకూ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్‌ ఎదురు చూసిన ఎదురు చూపులు ఫలించేశాయి. ఈ రోజే సినిమా షూటింగ్‌ సార్ట్‌ అయ్యింది. 

బిగ్‌ ప్రాజెక్టే.. అనౌన్స్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ ఎప్పుడు ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లాలిలే అని పెదవి విరిచిన వారూ ఉన్నారు 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయంలో. కానీ రాజమౌళి ఈ సారి కాస్త స్పీడు చూపించాడు. ఓపెనింగ్‌ అయిన కొద్ది రోజులకే సినిమాని సెట్స్‌ మీదికెక్కించేశాడు. రెగ్యులర్‌ షూటింగ్‌ ఇకపై రెగ్యులర్‌గా జరగనుంది. వీలైనంత ఎర్లీగా ఈ సినిమాని కంప్లీట్‌ చేసే యోచనలో రాజమౌళి ఉన్నాడట. గత చిత్రాల మాదిరి ఎక్కువ టైం ఈ సినిమాకి తీసుకోనంటున్నాడు రాజమౌళి. అంటే అభిమానుల కల అతి త్వరలోనే తీరిపోనుందన్నమాట. 

వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ రోజు రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అయిన సందర్భంగా అసలు ఈ ప్రాజెక్ట్‌కి ఎలాగైతే బీజం పడిందో ఒక్క పిక్‌ ద్వారా అదే పిక్‌ ఇప్పుడు మళ్లీ రిపీట్‌ అయ్యింది. చిన్న తేడా. ఇప్పుడు ఆ పిక్‌ సెట్స్‌లో దర్శనమిచ్చింది. రాజమౌళికిరువైపులా చరణ్‌, ఎన్టీఆర్‌ ఆప్యాయంగా అప్పటిలాగే పట్టుకుని కూర్చున్న పిక్‌ అది. 

ఈ పిక్‌ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లూ చాలడం లేదంతే. షేర్లు, లైకులు అబ్బో ఒక్కటేమిటీ సోషల్‌ మీడియా హోమ్‌లో ఈ పిక్‌ తెగ వైరల్‌ అయిపోతోందిలే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS