రాజమౌళి దర్శకత్వంలో రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓ మ్యాజికల్ ఇంట్రో బయటకు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ‘కానుక’ అది. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతోంది. అప్పటికి మరో స్పెషల్ గిఫ్ట్ ఎలాగూ సిద్ధమవుతుందనుకోండి.. అది వేరే సంగతి. ఈలోగానే మరో ‘గ్లింప్స్’ రాబోతోందనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఆ ‘గ్లింప్స్’ ఏంటి.? ఎప్పుడు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి సంబంధించి ప్రతి నెలా ఏదో ఒక అప్‌డేట్ వుండేలా టీవ్‌ు ప్లాన్ చేసుకుంటోందట.
ఈ క్రమంలోనే ఈ నెలలో ఇంకో అప్‌డేట్ ఇవ్వాలనే ఆలోచనలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ వుందనీ, ప్రస్తుతం ఆ దిశగా సమాలోచనలు కూడా జరుగుతున్నాయనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఎలాగూ, వచ్చే నెలలో ఎన్టీఆర్‌కి సంబంధించిన అప్‌డేట్ వుంటుంది గనుక, ఈ నెలలో గ్లింప్స్ అనేది రావడం అంటూ జరిగితే, అది ఇంకాస్త డిఫరెంట్‌గా.. యంగ్ టైగర్‌తో సంబంధం లేకుండా వుండొచ్చు. కానీ, అదేంటి.? అనంటే, అంతా సస్పెన్స్ అనే మాట విన్పిస్తోంది. ఈ సినిమాలో రామ్చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. అజయ్ దేవగన్, సముద్రఖని తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. యంగ్ టైగర్ సరసన ఒలీవియా మోరిస్ కన్పించబోతోంది.