'కొమరం భీమ్‌' లవర్‌ ఈమేనా?

మరిన్ని వార్తలు

ప్రతిష్ఠాత్మక మల్టీ స్టారర్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ కోసం వేట కొనసాగుతూనే ఉంది. విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ హ్యాండివ్వడంతో, ఆ ప్లేస్‌ని రీప్లేస్‌ చేసే విదేశీ యువతిని వెతికి పట్టుకోవడం 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌కి పెద్ద తలనొప్పిగానే మారింది. ఎట్టకేలకు ఆ భామని వెతికి పట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మా రాబర్ట్స్‌ అనే అమెరికన్‌ నటి, సింగర్‌ అయిన ఓ యువతిని ఎన్టీఆర్‌కి జోడీగా ఎంపిక చేశారంటూ ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

 

ఈ విషయమై 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ ఇంకా అఫీషియల్‌గా ప్రకటన ఇవ్వలేదు. కానీ, ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి దాదాపు సిద్ధమే అని తెలుస్తోంది. హాలీవుడ్‌ భామని వెతికి వెతికి విసిగిపోయిన రాజమౌళి చివరాఖరికి బాలీవుడ్‌ భామలకే విదేశీ ముసుగు వేసి సరిపెట్టేస్తాడేమో అనుకున్నారంతా. కానీ, రాజమౌళి కమిట్మెంటే, కమిట్మెంట్‌. అస్సలేమాత్రం రాజీ పడలేదు. ఒకవేళ ఎమ్మా రాబర్ట్స్‌ ఖారారైన మాట నిజమే అయితే, మొత్తానికి రాజమౌళి ఘటికుడే అనుకోకుండా ఉండలేం.

 

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కొమరం భీమ్‌ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్‌, ఓ విదేశీ యువతి ప్రేమలో పడతాడు. ఆ పాత్రకు నేచురాలిటీ తీసుకురావాలంటే, ఆ పాత్రలో విదేశీ భామనే హీరోయిన్‌గా ఎంచుకోవాలన్నది రాజమౌళి పట్టు. అందుకే ఏరి కోరి విదేశీ భామనే దిగుమతి చేశాడనుకోవాలి. చూడాలి మరి ఎమ్మా పేరును అధికారింకగా ఎప్పుడు ప్రకటించనున్నారో. ఇకపోతే ఈ సినిమాలో మరో హీరో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామరాజు భార్య సీతగా బాలీవుడ్‌ భామ అలియాభట్‌ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS