ఆర్.ఆర్.ఆర్... ప్రమోషన్లు భారీ ఎత్తున సాగుతున్నాయి. ఎప్పుడూ లేనిది... తన సినిమాకి సంబంధించిన ప్రమోషన్లకు ఎక్కువ సమయం కేటాయించగలిగాడు రాజమౌళి. జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. దానికి నెల రోజుల ముందే.. హడావుడి మొదలైపోయింది. ముందు ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఆ తరవాత చెన్నై, కొచ్చిలలో. బెంగళూరులోనూ ఓ పెద్ద ఈవెంట్ జరగబోతోంది. ఆ తరవాత హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తారు.
జనవరి 3 తరవాతే... ఆర్.ఆర్.ఆర్ వేడుక హైదరాబాద్ లో జరగబోతోందని టాక్ వినిపిస్తోంది. ముంబై ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ అతిథిగా వచ్చాడు. చెన్నైలో శివ కార్తికేయన్ గెస్ట్ రోల్ పోషించాడు.కేరళలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే అతిథిగా హాజరయ్యాడు. ఇప్పుడు హైదరాబాద్ వంతు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ లు అతిథులుగా వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ ముగ్గురిలో ఇద్దరు కచ్చితంగా ఈవెంట్ కి హాజరు అవుతారని టాక్. ఆ తరవాత ఆంధ్రాలో కూడా ఓ ఈవెంట్ ఉండబోతోంది. అక్కడకి మాత్రం కేవలం చిత్రబృందం మాత్రమే హాజరు అవుతుంది.