RRR.... మ‌రోసారి వాయిదా?

మరిన్ని వార్తలు

లాక్ డౌన్ వ‌ల్ల షూటింగుల‌న్నీ ఆగిపోయాయి. లాక్ డౌన్ ఎత్తేసినా షూటింగులు మ‌ళ్లీ తిరిగి మొద‌ల‌వుతాయో, లేదో తెలీని ప‌రిస్థితి. దాంతో.. సినిమాల విడుద‌ల తేదీల‌న్నీ గ‌ల్లంత‌య్యాయి. ఈ ప్ర‌భావం ఆర్‌.ఆర్‌.ఆర్‌పై కూడా ప‌డిన‌ట్టు తెలుస్తోంది. 2021 సంక్రాంతికి ఈసినిమాని విడుద‌ల చేస్తామ‌న్నారు. జ‌న‌వ‌రి 8న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ఇది వ‌ర‌కే చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇప్పుడు మ‌రోసారి ఆర్‌.ఆర్‌.ఆర్‌. వాయిదా ప‌డిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల భోగ‌ట్టా. ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్ దాదాపు 70 శాతం పూర్త‌యింది.

 

మ‌రో 30 శాతం బాకీ. అయితే.. ఈ 30 శాతంలో భారీ యాక్ష‌న్ దృశ్యాలున్నాయి. అలీయాభ‌ట్‌, అజయ్ దేవ్గన్ ల తో తెర‌కెక్కించాల్సిన స‌న్నివేశాలున్నాయి. వాళ్ల డేట్లు క్లాష్ అవ్వ‌కుండా చూసుకుంటూ, సినిమాని పూర్తి చేయ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. దాంతో.. అనుకున్న స‌మ‌యానికి ఆర్‌.ఆర్‌.ఆర్ పూర్త‌య్యే అవ‌కాశాల్లేవ‌ని తేలింది. దాంతో.. ఈ సినిమాని వేస‌వికి వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ విష‌య‌మై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS