రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాక కొద్ది రోజుల్లోనే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకి రామ్‌చరణ్ కాలి గాయం కారణంగా బ్రేక్ పడింది. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికీ గాయం కావడం.. అలా దాదాపు నెల రోజులు పైనే 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ వాయిదా పడిపోయింది. ఈ మధ్యనే హీరోలిద్దరూ గాయాల నుండి తేరుకోవడంతో, షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరిగిందట.
అయితే, తాజాగా మరోసారి 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌కి బ్రేక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జయంతి కారణంగా ఆ మహానుభావున్ని తలుస్తూ, 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ప్రోగ్రెస్‌ని నిర్మాణ సంస్థ అయిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఆడియన్స్‌తో పంచుకుంది. 'ఇంతవరకూ ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరిగింది.
ఔట్‌పుల్ చాలా బాగా వచ్చింది. మా భీమ్.. రామరాజు చాలా బాగా నటిస్తున్నారు.. కానీ, డైరెక్టర్ రాజమౌళి అమెరికా టూర్లో ఉన్నందున మళ్లీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ మరో వారం రోజుల పాటు వాయిదా పడిందని..' వారు తెలిపారు. అయితే రాజమౌళి అమెరికా టూర్, 'ఆర్ఆర్ఆర్' పని మీదనే అని ఇన్సైడ్ సోర్సెస్ టాక్. ఈ సినిమాలో బాలీవుడ్ భామ అలియాభట్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో సస్పెన్స్ ఇంకా తీరలేదు. బాలీవుడ్ హీరో అజయ్‌దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.