లాక్ డౌన్ వల్ల ఎక్కడి షూటింగులు అక్కడ ఆగిపోయాయి. `లైట్స్.. కెమెరా.. యాక్షన్` అనే మాటలు విని ఎన్ని రోజులు అయ్యిందో. షూటింగులు ఎలాగూ లేవు. కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనులైనా చేసుకోవచ్చు కదా. కానీ.. ఇప్పుడు వాటికీ బ్రేకులు పడిపోయాయి. నిన్నా మొన్నటి వరకూ ఇంట్లోనే కూర్చుడి ఎడిటింగ్, ఆర్.ఆర్ లాంటివి చేసుకున్నారు. ఇప్పుడు ఆ పనులూ జరగడం లేదట. తాజాగా `ఆర్.ఆర్.ఆర్` పనులకూ బ్రేకులు పడిపోయాయని సమాచారం.
ఈ విషయాన్ని సంగీత దర్శకుడు కీరవాణినే స్వయంగా చెప్పారు. ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన ఎలాంటి పనులూ జరగడం లేదని, వాటిని ఆపేసేమని, లాక్డౌన్ ఎత్తేసిన తరవాతే ఆర్.ఆర్.ఆర్ పనులు మళ్లీ మొదలవుతాయని చెప్పారు. ఇటీవలే రామ్ చరణ్పుట్టిన రోజు సందర్భంగా ఓ టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ కోసమే చిత్రబృందం చాలా కష్టపడాల్సివచ్చిందట. అజయ్ దేవగణ్ పుట్టిన రోజున మరో టీజర్‌ని విడుదల చేద్దామని భావించింది చిత్రబృందం. కానీ లాక్ డౌన్ వల్ల సాధ్యపడలేదు.