రాజమౌళి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'ఆర్‌ఆర్‌ఆర్' విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడి ఆన్ లొకేషన్ నుండి కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. 'బాహుబలి'లో విజువల్ అద్భుతాల్ని తన సినిమాటోగ్రఫీ టాలెంట్‌తో చూపించి ప్రేక్షకుల మదిని దోచిన సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ తీసిన సెల్ఫీ షాట్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్'కి సంబంధించిన టెక్నీషియన్లు కనిపిస్తున్నారు.
కానీ మన హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు మాత్రం కనిపించడం లేదు. మరి వీరెక్కడ? ఈ మధ్య ఎన్టీఆర్, చరణ్ కూడా విదేశాలకు వెళ్తున్నారనే ప్రచారం జరిగింది. కీలక సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరుగుతుందనే సమాచారం ఉంది. మరోవైపు ఈ షెడ్యూల్‌లో చరణ్ పాల్గొనడం లేదనీ, ఈ షెడ్యూల్ మొత్తం కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ పైనే చిత్రీకరించనున్నారన్న టాక్ కూడా వినిపించింది. సో ఎన్టీఆర్ మాత్రమే విదేశాలకు పయనమయ్యాడనీ మాట్లాడుకున్నారు.
అంతే కాదు, ఎన్టీఆర్‌తో జత కట్టబోయే విదేశీ భామ ఎమ్మా రాబర్ట్స్ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ కానుందనే ప్రచారం కూడా జరిగింది. అలా అయితే, ఈ టీమ్‌లో ఎన్టీఆర్ కూడా ఉండాలి కదా. పిక్ బాగుంది. కానీ, మన హీరోలు కూడా కనిపిస్తే ఇంకా కిక్ ఉండేది.. అంటూ ఫ్యాన్స్ జక్కన్నను అడుగుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు మన జక్కన్న, ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫోటోలు కూడా వదలాల్సి ఉంది.