బాలకృష్ణ - కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం `రూలర్`. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయకులుగా నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. కథ, కథనాల్లోపట్టు లేకపోవడం, రొటీన్ అంశాలు మేళవించి సినిమాని చుట్టేయడంతో - తొలిరోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. చివరికి డిజాస్టర్‌గా మారింది. తొలి వారాంతంలో పట్టుమని పది కోట్టు కూడా సంపాదించలేకపోయింది. 7.25 కోట్లు మాత్రమే వచ్చాయి. దాదాపు 24 కోట్లకు ఈ సినిమా అమ్మాయి. అంటే 25 శాతం కూడా తిరిగి రాలేదన్నమాట.
ఈ యేడాది బాలయ్యకు మూడో డిజాస్టర్ ఇది. కథానాయకుడు, మహానాయకుడు కూడా ఇలాంటి ఫలితాలనే చవి చూశాయి. బాలయ్య సినిమాలకు మంచి గిరాకీ ఉన్న సీడెడ్లోనే ఈ సినిమాకి ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి. అక్కడ 1.9 కోట్లు తెచ్చుకుంది. నైజాంలో 1.3 కట్లు వచ్చాయి. ఉత్తరాంధ్రలో 48 లక్షలు, గుంటూరులో 1.33 కోట్లు వచ్చాయి. ఈస్ట్, వెస్ట్, కృష్ణా... ఎక్కడా ఈ సినిమా 30 లక్షలు మించి తెచ్చుకోలేకపోయింది. ఓవర్సీస్లో అయితే మరీ దారుణం. అక్కడ కేవలం 20 లక్షలు మాత్రమే వచ్చాయి.