ప్రతీ సంవత్సరం సంక్రాంతికి తన సినిమాని విడుదల చేయడం నందమూరి బాలకృష్ణకు అలవాటుగా మారింది. అయితే ఈసారి సంక్రాంతి కంటే ముందుగా `రూలర్`ని దించేశారు. క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి వరకూ ఆడుతుందని - బాలయ్య బల్ల గుద్ది మరీ చెప్పాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన చిత్రమిది. సి.కల్యాణ్ నిర్మాత. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే నెగిటీవ్ టాక్ వచ్చింది. బాలయ్య స్టెప్పులు. పోరాటాలూ మినహాయిస్తే సినిమాలో విషయం లేదని విశ్లేషకులు తేల్చేశారు. అయితే తొలిరోజు వసూళ్లు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి.
మొత్తానికి 4 కోట్ల షేర్ సాధించింది ఈ సినిమా. శుక్రవారం మూడు సినిమాలు విడుదలైతే.. ఎక్కువ వసూళ్లు బాలయ్య సినిమాకే వచ్చాయి. నైజాంలో 68 లక్షలు, సీడెడల్లో 98 లక్షలు, ఉత్తరాంధ్రలో 27 లక్షలు తెచ్చుకుంది. ఈస్ట్ , వెస్ట్ కలిసి 50 లక్షల వరకూ వచ్చాయి. నెల్లూరు లో 22 లక్షలు, కృష్ణలో 18 లక్షలు తెచ్చుకుంది. మాస్కి నచ్చే సినిమా ఇది. వాళ్లు ఆదుకుంటే, శని, ఆదివారాలు ఇదే స్థాయిలో వసూళ్లు తెచ్చుకుంటే కాస్తలో కాస్త గట్టెక్కే ఛాన్సుంది.