చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' ఎప్పుడో సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతవరకూ సెట్స్ మీదికెళ్లలేదు. ఇప్పట్లో సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కూడా కనిపించడం లేదనీ సమాచారమ్. దీనికంతటికీ కారణం, ఇంకా ఈ సినిమాలో చిరంజీవి గెటప్పే ఫైనల్ కాలేదట. అలాగే కథ విషయంలోనూ ఇంకా క్లారిటీ రాలేదనీ తెలుస్తోంది. నటీనటులు, టెక్నీషియన్స్ విషయంలోనూ పలు రకాల రూమర్స్ దుమారం రేపుతున్నాయి. అయితే టైటిల్ అనౌన్స్‌మెంట్ రోజే, ఈ సినిమాలోని ముఖ్య నటీనటులు, టెక్నీషియన్లను అనౌన్స్ చేసేశారు. అయితే ఇప్పుడు అందులోంచి కొంతమంది తప్పుకున్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కంటే, రూమర్సే ఎక్కువ ప్రచారమవుతున్నాయి. అయితే ఈ రూమర్స్ విషయంలో చిత్ర యూనిట్ అస్సలు స్పందించకుండా ఉండడం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గానీ, నిర్మాత చరణ్ కానీ ఈ రూమర్స్ పట్ల ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. ఎందుకో. 2017 జనవరిలో 'ఖైదీ' రిలీజయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయ్యిన ఇంతవరకూ ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లలేదంటే, ఈ సినిమా చుట్టూ రూమర్స్ మరింత పెరిగిపోయే అవకాశాలున్నాయి. మరో పక్క రామ్ చరణ్ 'రంగస్థలమ్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాకే 'సైరా'పై కాన్‌సన్‌ట్రేషన్ చేయనున్నాడనీ తెలుస్తోంది. చూడాలి ఇప్పటికైనా చిత్ర యూనిట్ స్పందించి 'సైరా'పై ఏదో ఒక క్లారిటీ ఇస్తే, కాస్త అయినా అభిమానులు ఊపిరి తీసుకున్నట్లవుతుంది.