'ఆర్‌ఆర్‌ఆర్‌' ఈ రూమర్స్‌ నిజమేనా.?

మరిన్ని వార్తలు

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా టైటిల్‌ ఏంటనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఈలోగా బోలెడన్ని టైటిల్స్‌ ప్రచారంలోకి వచ్చేశాయి. టైటిల్స్‌తో కూడిన డిజైన్స్‌ కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అవన్నీ అభిమానులు ఊహించి రూపొందిస్తున్న డిజైన్స్‌. ఇవి ఒరిజినల్‌ అనే స్థాయిలో ఉంటున్నాయి. ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ అలాంటిది. 

టైటిల్‌ విషయంలోనే కాదు, హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి కుప్పల తెప్పలుగా గాసిప్స్‌ వస్తున్నాయి. కైరా అద్వానీ, కీర్తిసురేష్‌ హీరోయిన్లుగా నటించబోతున్నారనీ ఓ ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, కన్నడ నటుడు యష్‌ ఇంకా మరికొన్ని పేర్లు ప్రచారంలోకొచ్చాయి. వీళ్లంతా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా కోసం ఎంపిక చేయబడ్డారు. వీళ్లే కాదు, ఇంకా పెద్ద స్టార్స్‌ వివిధ సినీ పరిశ్రమల నుండి టాలీవుడ్‌కి సరికొత్తగా రాబోతున్నారట. ఈ గాసిప్స్‌లో ఎన్ని నిజం.? ఎన్ని అబద్ధం.? అనేది ముందు ముందు తేలుతుంది. 

కానీ ఈలోగా అభిమానులకు గాసిప్స్‌ బోలెడంత కిక్‌ ఇస్తాయి. సాధారణంగా రాజమౌళి తన సినిమా ప్రారంభోత్సవం అప్పుడే చాలా విషయాలపై స్పష్టత ఇచ్చేస్తాడు. కానీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయంలో ఎందుకో ఎక్కువ గోప్యత పాఠిస్తున్నాడు. ఏం చేసినా రాజమౌళి నుండి మరో సంచలనం ఆల్రెడీ ఫిక్స్‌ అయిపోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS