రేణు దేశాయ్ కాబోయే భర్త ఫోటో...

By iQlikMovies - July 14, 2018 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

రేణు దేశాయ్- ఇప్పుడు ఈ పేరు వింటేనే పవన్ కళ్యాణ్ అభిమానులకి కోపోద్రిక్తులైపోతున్నారు. కారణం ఆమె తాజాగా పవన్ పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో దారుణం ఏంటంటే- ఇది భార్యాభర్తలు మధ్య ఉండాల్సిన విషయం బయట ప్రపంచానికి తెలిసి ఇప్పుడు వేళ మంది మాట్లాడుకుంటున్నారు. అసలైతే ఇది ఈ ఇద్దరు సామరస్యంగా తేల్చుకోవాల్సిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానుల పేరిట కొంతమంది చేసిన అత్యుత్సాహ చర్యలకి ఇప్పుడు ఈ అంశం రోడ్డున పడింది.

ఇక తాజాగా రేణు దేశాయ్ తనకి కాబోయే భర్త తో దిగిన ఒక ఫోటో అంటూ తన సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. అయితే ఆ ఫోటోని తీసింది తన కొడుకు అకీరా అని చెప్పడం విశేషం. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఈ మొత్తానికి కొసమెరుపు ఏంటంటే ఆ ఫోటోలో రేణు దేశాయ్ కి కాబోయే భర్త ముఖం మాత్రం కనపడడం లేదు.   

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS