తమిళంలోకీ రీమేక్‌ అవుతున్న 'ఆర్‌ఎక్స్‌100'

By iQlikMovies - August 13, 2018 - 12:24 PM IST

మరిన్ని వార్తలు

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన టాక్‌ సంపాదించిన సినిమా 'ఆర్‌ఎక్స్‌100'. అస్సలు అంచనాలే లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఊహించని వసూళ్లకు ట్రేడ్‌ వర్గాలే ఆశ్చర్యపోయాయి. 

ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి విజయం అందుకుంది. భారీ వసూళ్లు రాబట్టింది. అజయ్‌ భూపతి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం సాధించిన విజయంతో ఇతర చిత్ర పరిశ్రమలు ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసే ఆలోచన చేశారు. 

తాజాగా ఈ సినిమా రీమేక్‌ హక్కుల్ని తమిళ తంబీలు దక్కించుకున్నారు. ఓరా సినిమాస్‌ సంస్థ ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆది పినిశెట్టి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్‌ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

వాస్తవికతకు అద్దం పట్టే కథా, కథనాన్ని యూత్‌కి కనెక్ట్‌ అయ్యేలా చక్కగా తెరకెక్కించి చూపించారు. దాంతో యూత్‌ ఈ సినిమా పట్ల బాగా ఎట్రాక్ట్‌ అయ్యింది. హీరోయిన్‌ గ్లామర్‌ ఎలిమెంట్స్‌ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. చూడాలి మరి, పాయల్‌ రాజ్‌పుత్‌ రేంజ్‌లో తమిళంలో అందాలారబోసే ఆ హాట్‌ భామ ఎవరో.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS