ప్రస్తుతం టాలీవుడ్లోని మోస్ట్ వాంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి. `ఆర్.ఎక్స్ 100`తో టాలీవుడ్లో సంచలనం సృష్టించారు. ప్రస్తుతం మరో సినిమా పనిలో బిజీగా ఉన్న అజయ్ భూపతి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. అజయ్ తండ్రి వేగ్నేశ రామరాజు ఈరోజు ఉదయం రాజమండ్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు.
గత కొంతకాలంగా రామరాజు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల ఆ సమస్య తీవ్రతరమైంది. బుధవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు సంతానం. కుమారుడు అజయ్ భూపతి సినిమాల్లో స్థిరపడితే.. కుమార్తె విదేశాల్లో ఉన్నారు. తండ్రి మరణవార్త తెలియగానే హుటాహుటిన రాజమండ్రి వెళ్లారు అజయ్.