'ఆర్‌ఎక్స్‌' హీరో కొత్త మూవీ షురూ.!

By iQlikMovies - December 27, 2018 - 17:45 PM IST

మరిన్ని వార్తలు

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో సెన్సేషన్‌ సృస్టించిన హీరో కార్తికేయ తదుపరి చిత్రం షురూ అయ్యింది. కొత్త దర్శకుడు అర్జున్‌ జంధ్యాలతో కార్తికేయ కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. బోయపాటి శీను శిష్యుడు అర్జున్‌ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనిల్‌ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. 

 

తొలి సినిమా ఇచ్చిన సంచలన విజయంతో రెండో సినిమా కోసం చాలా చాలా కథలు విన్నాడట కార్తికేయ. తొలి సినిమాతో వచ్చిన సక్సెస్‌నీ, క్రేజ్‌నీ కంటిన్యూ చేసేలా, అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యేలా ఈ సినిమా ఉండబోతోందంటున్నాడు. అర్జున్‌ మంచి టైమింగ్‌ ఉన్న దర్శకుడనీ, ఖచ్చితంగా కార్తికేయకు ఈ సినిమాతో మరోసారి మంచి గుర్తింపు దక్కుతుందనీ దర్శకుడు బోయపాటి శీను హామీ ఇచ్చారు. 

 

కాగా ఈ సినిమా టైటిల్‌, హీరోయిన్‌ తదితర వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇదిలా ఉంటే, 'ఆర్‌ఎక్స్‌ 100'లో కార్తికేయకు జోడీగా నటించిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌ ఆల్రెడీ రెండు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లోనూ, మాస్‌రాజా రవితేజతో ఓ సినిమాలోనూ పాయల్‌ నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS