ప్ర‌భాస్ సినిమాలో.. క‌ళాద‌ర్శ‌కుడి మెరుపులు.

మరిన్ని వార్తలు

ప్ర‌భాస్ - రాధాకృష్ణ కాంబినేష‌న్లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి `రాధే శ్యామ్‌` అనే పేరు దాదాపుగా ఖాయ‌మైంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఇందు కోసం హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఓ భారీ ఆసుప‌త్రి సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, మ‌గ‌ధీర‌, ఈగ లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కు ప‌ని చేసిన ఎస్‌.ర‌వీంద‌ర్ రెడ్డి ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ల‌ను తీర్చిదిద్దుతున్నారు. అందుకోసం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో 5 కోట్ల విలువైన ఆసుప‌త్రి సెట్‌ని ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు ర‌వీంద‌ర్‌.

 

ఈ సెట్లోనే ప్ర‌భాస్ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది. జులై మొద‌టి వారంలో ప్ర‌భాస్‌సినిమా షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. యూర‌ప్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో యూర‌ప్‌లో షూటింగ్ చేయ‌డం అసాధ్యం. అందుకే అక్క‌డ తీయాల్సిన స‌న్నివేశాల్న‌నీ సెట్స్ వేసి, హైద‌రాబాద్ లోనే లాంగించేస్తారు. క‌ళా ద‌ర్శ‌కుడు ర‌వీంద‌ర్ యూర‌ప్ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలా సెట్స్‌కి హైద‌రాబాద్‌లో తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా కోసం ర‌వీంద‌ర్ వేసిన సెట్స్ అంత‌ర్జాతీయ స్థాయిలో ఉండ‌బోతున్నాయ‌ని, అవ‌న్నీ ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానున్నాయ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS